*స్వాతంత్ర్య దినోత్సవం ఉపన్యాసం*
ప్రారంభం:వేదిక నలంకరించిన పెద్దలకు మరియు నా తోటి విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క నమస్కారములు.
విషయం: ఈరోజు మనం 70వ (సంవత్సరం సరిచూసుకోండి) స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్నామ్.
ఈనాడు మనం ఆస్వాదిస్తున్న ఈ స్వతంత్రం ఎంతోమంది దేశభక్తుల త్యాగ ఫలితంగా సిద్ధించింది.
1757 ప్లాసి యుద్ధం ద్వారా బ్రిటిషు చేతికి అందిన మన పరిపాలన వ్యవస్థను మళ్లీ మన చేజిక్కించుకొనుటకు దాదాపుగా 190 సంవత్సరాల కాలయాపన చేయవలసి వచ్చింది.
1857 సిపాయిల తిరుగు బాటు ద్వారా పురుడు పోసుకున్న స్వాతంత్ర్య పోరాటం,హోంరూల్ ఉద్యమం,సత్యాగ్రహం, ఖిలాఫత్ ఉద్యమం,స్వదేశీ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, దండియాత్ర,క్విట్ ఇండియా ఉద్యమం వంటి అనేక ఉద్యమాల తరువాత విజయం సాధించింది.
ఇంతటి శ్రమతో, కటోర దీక్షతో పొందిన స్వాతంత్ర్యాన్ని,స్వతంత్ర భారతాన్ని అభివృద్ధి పరచవలసిన భాద్యత మనందరిది.ఇందుకోసం ప్రతి భారతీయ పౌరుడు పాటుపాడవలసిన అవసరం ఉన్నది.
స్వామి వివేకానందుడు చెప్పినట్లు భావిభారతదేశాన్ని అభివృద్ధి పరచుటకు "ఇనుప నరాలు, ఉక్కు కండరాలు కలిగిన యువత కదిలి రావాలి".
ఈ 70 సంవత్సరాల స్వతంత్ర్య భారతదేశం ఈనాటికీ అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోనే ఉండిపోతుంది.
ఇకముందు మన దేశ అభివృద్ధి కి, మన చుట్టు ఉన్న సమాజ శ్రేయస్సుకు నేను నాది అన్న భావనతో కాకుండా మనది మనం అనె భావంతో భారతీయులందరం కలసి మెలసి ఉందాం దేశ అభ్యున్నతి పాటు పడుదాం అని ఆశిస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.
ముగింపు: నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాధాలు.
***జైహింద్****
6 Comments
nice
ReplyDeleteబాగుంది
ReplyDeleteబాగుంది
ReplyDeleteబానేఉంది
ReplyDeleteఅద్భుతమైన ఉపన్యాసం
ReplyDeleteGood
ReplyDelete