Teachers day speech
భారత దేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న సర్వేపల్లి రాధాక్రిష్ణన్ జయంతి రోజున ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాము. రాధాకృష్ణన్ గారు భారతదేశపు మొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి అంతకు మించి ఒక గొప్ప తత్వవేత్త మరియు ఉపాధ్యాయుడు.21 సంవత్సరాల వయసులోనే ప్రొఫెసర్‌గా ఎదిగిన గొప్ప వ్యక్తి.
రాధాకృష్ణన్ ది నిరుపేద కుటుంబమ్,తన తండ్రి వీరాస్వామి తనను చదివించలేని స్థితిలో కొడుకును పూజారిగా పని చేయమన్నారు.కాని రాధాక్రిష్ణన్ కి చదువంటే ప్రాణం ఉన్నత చదువుల కోసం తిరుపతి లోని మిషనరి పాఠశాలలో చేరాడు.
అప్పటి నుండి ఆయన చదువంతా ఉపకార వేతనాలతోనే కొనసాగించారు.తినడానికి అరటాకు కొనుక్కోలేని పరిస్థితులలో ఆయన ఎన్నోసార్లు నేలను శుభ్రం చేసికొని తినేవారట.ఆవిధంగా కష్టపడి తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్న రాధాకృష్ణన్ గారు మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ప్రొఫెసర్‌గా,ఆంధ్ర విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్‌గాను,భారతదేశపు ఉపరాష్ట్రపతిగా,మరియు భారతదేశ ప్రథమ పౌరుడయిన రాష్ట్రపతి పదవిని అధిరోహించినారు.
అప్పటి నుండి ఆయన చదువంతా ఉపకార వేతనాలతోనే కొనసాగించారు.తినడానికి అరటాకు కొనుక్కోలేని పరిస్థితులలో ఆయన ఎన్నోసార్లు నేలను శుభ్రం చేసికొని తినేవారట.ఆవిధంగా కష్టపడి తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్న రాధాకృష్ణన్ గారు మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ప్రొఫెసర్‌గా,ఆంధ్ర విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్‌గాను,భారతదేశపు ఉపరాష్ట్రపతిగా,మరియు భారతదేశ ప్రథమ పౌరుడయిన రాష్ట్రపతి పదవిని అధిరోహించినారు.
రాష్ట్రపతిగా కొనసాగుతున్న కాలంలో తన ద్వారా విద్యనభ్యసించిన విద్యార్థులు మరియు మిత్రులు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడానికి వచ్చినప్పుడు.తమ పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటే ఎక్కువ ఆనంద పడతాను అని తన మనోభావాన్ని వ్యక్తపరిచారు.నాటి నుండి ప్రతిసంవత్సరం సెప్టెంబర్ 5 న దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు.
ఈరోజున పాఠశాలలు,విద్యాసంస్థలలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరుపుతారు.
మాత్రుదేవోభవ,పిత్రుదేవోభవ,ఆచార్యదేవోభవ!
కనిపించే దైవాలలో తల్లితండ్రి తరువాతి స్థానం ఆచరించి చూపే ఆచార్యునికి కల్పించడం జరిగింది.
అజ్ఞానాంధకారంలో జన్మించిన శిశువుకు తన స్పర్శతో ధైర్యాన్నిచ్చే తల్లి మెదటి దైవం.
తప్పటడుగులు వేస్తున్న శిశువు వేలు పట్టి సక్రమమయిన దారిలో నడిపే తండ్రి రెండవ దైవం.
మానసిక పరిపక్వత చెందిన తర్వాత విద్యాబుద్ధులు నేర్పి శిశువు జీవితం సఫలీకృతం అయ్యే విధంగా తీర్చిదిద్దే గురువు మూడవ దైవం.
ప్రతి వ్యక్తి విద్యాభ్యాసంలో ఎంతోమంది గురువుల ద్వారా విద్యనభ్యసించడం జరుగుతుంది కాని అందులో కొందరిని మాత్రమే విద్యార్థి ఆదర్శంగా తీసుకోని అనుసరిస్తాడు.
ఈవిధంగా ఆదర్శంగా తీసుకోనే గురువే సద్గురువు, విద్యార్థికి పాఠాలు మాత్రమే చెప్పేది గురువు అయితే పాఠాలతో పాటుగా జీవిత పాఠాలు భోధించేవారు సద్గురువులు.
గురుః బ్రహ్మ గురుః విష్ణు;గురుదేవో మహేశ్వర!
గురుః సాక్షాత్ పరబ్రహ్మ;తస్మైశ్రీ గురవేనమః !!
గురువు- బ్రహ్మ వలె సద్గునములను సృష్టించువాడు.విష్ణువువలె సద్వృత్తులబపాలకుడు మరియు మహాదేవుని (శివుని)వలె దుర్గునాల సంహారకుడు.
ఇంకను జీవ శివుల కలయిక నొనర్చు గురువు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం.
ఇది భారతీయ సంస్కృతి యెక్క సుమధుర మరియు భావకావ్యము.
గురువు వద్దకేగుట తోడనే బుద్ధి గ్రహన శీలమవుతుంది,అతని సహవాసము ఎంత మధురమైనదనగా అతని నుండి విడిపోవాలని అనిపించదు.అతని అమ్రుతమయ ద్రష్టిపడుట తోడనే మనసునందలి మాలిన్యము తొలగిపోవును,ఇట్టి గురువును పూజించుట భారతీయ సాంప్రదాయము.
13 Comments
Nice essay..
ReplyDeletesuper
Deletesuper telugu speech
ReplyDeleteNice but not suitable for a student to tell like this .It is totally abt Radhakrishnan not abt the importance of teachers
ReplyDeleteThis a Radhakrishna speech but not teachers day speech
DeleteThis is only about Radhakrishnana not about teacher's importance
DeleteThanks I can prepare this speech to present in scl
ReplyDeleteThanks I can prepare this speech first paragraph in school
ReplyDeletePhenomenal speech thank you for your information sir/madam
ReplyDeleteThank you very much for this speech.l got first for saying about the teachers day
ReplyDeleteNice specch i can prepare this speech for teachers day which is celebrated in our school
ReplyDeleteWonderful speech in Telugu
ReplyDeleteThanks
ReplyDelete